22 June, 2026 | 7:49 PM

Breaking News

అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •  

నాగిరేశ్వర దేవాలయం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం

16-02-2026 05:36 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వయంభూ లింగమైన నాగిరేశ్వర దేవాలయం వద్ద వెంకీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శివరాత్రి వంటి పవిత్రమైన రోజున సేవాభావంతో అన్నదానం చేయడం ద్వారా సమాజానికి మేలు చేకూరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలకు భోజనం అందించారు. కార్యక్రమ ఏర్పాట్లను యువత సమిష్టిగా నిర్వహిస్తూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకీ ఫ్రెండ్స్ సభ్యులు పాల్గొన్నారు