calender_icon.png 16 February, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి సీఎం కప్ జూడో, రెజ్లింగ్ పోటీల్లో జిల్లా జట్లు సత్తా చాటాలి

16-02-2026 05:41:28 PM

జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో జరగనున్న సీఎం కప్ 2 వ ఎడిషన్ రాష్ట్రస్థాయి జూడో, రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పెద్దపెల్లి జిల్లా జట్లు అద్వితీయ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి జిల్లా ను నెంబర్ వన్ స్థానంలో నిలుపాలని పెద్దపెల్లి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ. సురేష్ అన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా జూడో, రెజ్లింగ్ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాలలో సోమవారం  నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం జూడో, రెజ్లింగ్ పోటీలను సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రవీందర్ తో కలిసి సురేష్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ తొలి ఎడిషన్ లో జూడో విభాగంలో జిల్లా క్రీడాకారులు రజత, కాంస్య పతకాలను సాధించారని ఈ సంవత్సరం బంగారు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ క్రీడా హబ్ గా మారుతున్నదని అన్ని క్రీడల పోటీల నిర్వహణకు నిలయంగా మారిందన్నారు. ఆత్మస్థైర్యానికి పతీకగా నిలిచే జూడో, రెజ్లింగ్ క్రీడల్లో ఇప్పుడిప్పుడే జిల్లాలో ఆదరణ పెరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా పోటీలకు ఆదిత్యమిచ్చిన శ్రీవాణి జూనియర్ కళాశాల యజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, వాలీబాల్ సంఘం అధ్యక్షులు ఎం.రవీందర్, పెద్దపెల్లి జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వేల్పుల సురేందర్, దాసరి రమేష్, శ్రీవాణి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సంయుక్త కార్యదర్శి బైరగోని రవీందర్ గౌడ్,  జూడో, రెజ్లింగ్ క్రీడల సంఘం కార్యదర్శులు సిలివేరి మహేందర్,  వంశీ, అంతర్జాతీయ ఖో ఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్, ఫిజికల్ డైరెక్టర్ లు దాసరి ప్రసాద్, సమ్మయ్య, ప్రణయ్ , సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు ముస్తఫా, ఇక్బాల్, అజ్జు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.