ఆంజనేయ స్వాములకు అన్నదానం
సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్ట ణంలోని పెరిగిద్ది ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష స్వాములకు నిత్య అన్నదానంకొనసాగుతున్నందున బుధవారం ఆలయ కమిటీ డైరెక్టర్ కత్తెర్ల స్వరూప పోచమల్లు దంపతులు, వారి కుటుంబ స భ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పోచమల్లు సోద రుడు రిపోర్టర్ కత్తెర్ల చందర్ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,
ఈ సందర్భంగాఆంజనేయస్వామి దీక్షపరులు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కత్తర్ల పోచమల్లు, వారి సోదరుడు చందర్ కుటుంబ సభ్యులకు సీతారా ముల వారు, ఆంజనేయస్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని దీవించా రు.... ఈ సందర్భంగా అన్నదానం చేపట్టిన కత్తెర్ల పోచమల్లు, చందర్ దంపతులను ఆంజనేయ స్వామి దీక్షపరులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో దేవాలయం అర్చకులు కొండపలకల అభిలాష్ స్వామి, భక్త బృందం పాల్గొన్నారు...






