రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
లేదంటే వాహనదారులపై కఠిన చర్యలు: డీజీపీ శివధర్ రెడ్డి
చిట్యాల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్‌రెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్రం లో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యా ల మండలం వేలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాల అవగాహన హోర్డింగ్‌ను డీజీపీ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు డీఐజీ ఎల్‌ఎస్‌చౌహాన్, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. డీజీపీ మాట్లాడుతూ, జాతీయ రహదారులపై నిబంధనలు పాటించకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గూడ్స్ వాహనాల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి అని, రేర్ మార్కింగ్ ప్లేట్స్ కచ్చితంగా ఉండాలని, నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాల ని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ను డీజీపీ ఆదేశించారు.
వేలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి జాతీయ రహదారి 65పై ఉన్న పిట్టంపల్లి క్రాస్ వద్ద చీకటి కారణంగా తరచూ ప్రమాదాలుజరుగుతున్నాయని,అక్కడ తక్షణమే హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని వినతిపత్రాన్ని అందజేశా రు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






