calender_icon.png 7 February, 2026 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద జ్యోతి హైస్కూల్ లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

07-02-2026 07:12:50 PM

ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి బోడుప్పల్ సర్కిల్ పరిధి ఐఐసిటి కాలనీలోని ఆనంద జ్యోతి హైస్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి పాల్గొని ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంతోపాటు ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వస్తున్నాయని, నేటి పిల్లలు జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు.

ఇలాంటి సమయంలో  ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం వల్ల పౌష్టికాహారం, వాటి యొక్క ఆవశ్యకత పిల్లలకు తెలుస్తుందని, విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు, ఉచిత వైద్య శిబిరాలు,  రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్ భాస్కర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు సంజీవ, వెంకట్, ప్రేమ్ బాబు, శైలజ, రమాదేవి, జయ, వైష్ణవి, మెహత, అనుష, ఫోరిన్ ,స్వాతి నరసింహ, ఏ శైలజ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.