07-02-2026 07:15:36 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో న్యాయవాదుల అడ్ హాక్ కమిటీ ఏర్పాటు అంశంపై మేడిపల్లి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు శనివారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, అవసరాల కోసం ముఖ్యంగా ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని తీర్మానాలు చేసుకోవడం జరిగింది.
ఏకపక్షంగా ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, బార్ కౌన్సిల్లో వినతి పత్రం ఇవ్వాలని, సీనియర్ న్యాయవాదులు అందరూ కలుపుకొని ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఉప్పల్ కోర్టులో కూడా సభ్యత్వ నమోదు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మట్టపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ, నర్సింగోజు నరేష్ కుమార్, రామకృష్ణ, కిరణ్, వంశీ, విజయ్ వరుణ్, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, పవన్, రాధికా,పలువురు సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.