23-09-2025 10:27:39 AM
చేగుంట, విజయక్రాంతి: మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఉన్న మదర్సాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్(Food poisoning for students) తో అస్వస్థతకు గురైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మదర్సాలోని విద్యార్థులు రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు, స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా పది మంది విద్యార్థులనురామాయంపేటప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు నిర్దారించారు