calender_icon.png 23 September, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

23-09-2025 11:31:55 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Reventh Reddy) ములుగు జిల్లా మేడారం పర్యటనకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో మేడారంకు(Medaram) పయనం అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా సమ్మక్క-సారలమ్మ గద్దెలను సీఎం, మంత్రులు దర్శించుకోనున్నారు. స్థానిక పూజారులు, పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ ను సీఎం విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజ‌న సంప్ర‌దాయాలు, విశ్వాసాల‌కు భంగం కలగకుండా ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టనుంది. మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.