23-09-2025 10:23:40 AM
నవాబుపేట: అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వివాహిత అదృశ్యం అయినా సంఘటన మండల పరిధిలోని పల్లెగడ్డ గ్రామంలో(Pallegadda Village) సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోమాల పాండయ్య కూతురు నవనీత తన పక్కలో పడుకున్న ఉన్న రెండు సంవత్సరాల వయస్సు గల తన కుమారుని వదిలి అక్కడి నుండి అదృశ్యమైంది.ఆమెను వీరాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్ కు ఇచ్చి వివాహం చేయగా.. తన భర్త కుమారుడితో పాటు పెద్దల పండుగకు తల్లిగారి ఊరైన పల్లెగడ్డకు వచ్చి పండుగలో అందరితోపాటు ఇంట్లో నిద్రించింది. అర్ధరాత్రి వేళ ఆమె కుమారుడు విహాంగ్కు తల్లి కనిపించకపోవడంతో ఆమె కోసం బిగ్గరగా ఏడవడంతో ఉలిక్కిపడి లేచిన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల ఎంతగానో వెతికారు. అయినా అమె ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి పాండయ్య తన కూతురు ఆచూకీ కనుగొనాలని కోరుతూ సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.