calender_icon.png 23 September, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం: మంత్రి ఉత్తమ్

23-09-2025 11:43:32 AM

హైదరాబాద్: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy ) పేర్కొన్నారుఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్ లో వాదనలు కొనసాగనున్నాయి. ట్రైబ్యునల్ లో వాదనల దృష్ట్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పయనం అయ్యారు. ట్రైబ్యునల్ లో వాదనలను మంత్రి ఉత్తమ్ పరిశీలించనున్నారు. ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ -2 ఉమ్మడి ఏపీకి 1050 టీఎంసీలు కేటాయించిందని ఉత్తమ్ వెల్లడించారు. ఇప్పుడు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70 శాతం వాటా కోరుతున్నామని తెలిపారు. నదీ పరివాహకం, సాగుభూమి, జనాభా ఆధారంగా అధికవాటా కోరుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జిలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. 299 టీఎంసీలకే అంగీకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసిందని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను బేసిన అవతలకు తరలిస్తోందని ఆరోపించారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామని తేల్చిచెప్పారు. తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడుతామని స్పష్టం చేశారు.