23-09-2025 10:29:57 AM
అలంపూర్ : గద్వాల జిల్లా(Jogulamba Gadwal) అలంపూర్ మండలం లింగనవాయి గ్రామ శివారులో ఇవాళ ఉదయం తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో బైకు అదుపుతప్పి ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలపాలయ్యారు.ఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం ....పెబ్బేరు మండలం చెలిమెల్ల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు పని నిమిత్తం లింగన వాయి గ్రామానికి వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులో బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు ప్రమాదానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.