12 July, 2026 | 3:40 AM

రామ్ చరణ్ కోసం..

14-12-2024 12:00 AM

రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకూ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచా యి. ఈ అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ వినూత్నంగా అడుగులు వే స్తోంది. ఈ క్రమంలోనే ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ అమెరికాలో నిర్వహించనుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా తన ప్రి రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వహించలేదు. ఈ క్రెడిట్ ‘గేమ్ చేంజర్’కే దక్కింది. డిసెంబర్ 21న అమెరికాలోని డల్లాస్‌లో ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో ‘ఆర్‌సీ 17’ రూపొందనుంది. ఈ నేపథ్యంలో డల్లాస్‌లో జరగబోతున్న ‘గేమ్ చేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్ర ల్లో మెప్పించనున్నా రు. ఎస్‌ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.