21-11-2025 01:12:19 AM
చర్ల, నవంబర్ 20 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రం చిహ్కాఉస్పరి రహదారిపై మా వోయిస్టులు అమర్చిన 10 కిలోల ఐఈడీని భద్రతాబలగాలు ధ్వంసం చేశాయి. భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్, బీడిఎస్ బీజాపూర్ నుంచి ఒక బృందం భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్పరి ప్రాంతంలో గస్తీ కాస్తున్న సమయంలో విద్యుత్ తీగ కనిపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా శోధించగా పది కిలోల బరువున్న కమాండ్ ఐఈడి దొరికింది. బీజాపూర్ బిడిఎస్ బృందం అక్కడికక్కడే ధ్వంసం చేసింది.