16 April, 2026 | 9:21 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

వన దేవతలు సమ్మక్క-సారలమ్మ పునః ప్రతిష్ఠ

07-06-2025 01:54 AM

కల్లూరు,జూన్06(విజయ క్రాంతి)మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ రామానగర్ కాలనీ వన దేవతలైన సమ్మక్క- సారలమ్మ ల పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అంజి పూజారి ఆధ్వర్యంలో నిర్వహిం చడం జరిగింది.

మున్సిపాలిటీ ప్రధాన రహదారి లో సమ్మక్క -సారలమ్మ లను బక్తులు ఊరేగింపు తీసుకోని వెళ్లి పుల్లయ్య బంజర రోడ్డు లో ఉన్న అమ్మవార్ల గద్దెలు వద్ద పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ పా ల్గొని సమ్మక్క-సారలమ్మ లకు ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

ఎమ్మెల్యే దంపతులను ఆలయం నిర్వాహాకులు సాలువా తో సన్మానించారు,అనంతరం భక్తులకు ఏర్పాటు చేసి న అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో 7వ వార్డ్ రామనగర్ కాంగ్రెస్ నాయకులు కుంచాల వీరయ్య, కుంచాల గురవయ్య,తమ్మిశెట్టి దుర్గారావు, తదితర కాంగ్రెస్ నాయకులు భక్తులు పాల్గొన్నారు.