స్మశాన వాటిక అభివృద్ధికి మున్సిపాలిటీ పూర్తి సహకారం అందిస్తుంది
చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి మున్సిపల్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు పరిధిలో గల మున్సిపల్ స్మశాన వాటిక అభివృద్ధిని మున్సిపాలిటీ అడ్డుకుంటోందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అని అన్నారు. జూన్ 5న జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశానికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నిబంధనల ప్రకారం అనుమతులు రాగానే తదుపరి చర్యలు వేగవంతం చేస్తామన్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) తయారీలో ఉందన్నారు.అన్ని అనుమతులు పూర్తి కాగానే నిర్మాణానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థకు పూర్తి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తాం అని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ ధ్యేయం అని అన్నారు.
ప్రజల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనీ తెలిపారు. త్వరలోనే ఈ స్మశాన వాటికను అన్ని హంగులతో ఆదర్శవంతమైన స్మశానవాటికగా తీర్చి దిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉ ఊమారాణి శ్రీనివాస్ తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గం కట్టుబడి ఉంటుందన్నారు.






