19 June, 2026 | 2:48 AM

కబ్జాకు గురైన అటవీ భూమిలో మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులు

19-06-2026 12:04 AM

కొల్లాపూర్ రూరల్, జూన్ 18: మండల పరిధిలోని మొల్లచింతలపల్లి అటవీ ప్రాంత సమీపంలో కబ్జాకు గురైన సుమారు ఐదెకరాల అటవీ భూమిలో గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ వాణి కుమారి పాల్గొని తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నిర్వహిస్తున్న వన మహోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా కబ్జాకు గురైన అటవీ భూములను పునరుద్ధరించి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.

అటవీ భూములపై ఎవరైనా అక్రమంగా సాగు చేయడం, ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారితో పాటు సెక్షన్ అధికారులు మతిన్, దినేష్, శివకుమార్, నీలేష్, మల్లేష్, బీట్ అధికారులు మహేష్, నాగార్జున, శ్యామ్, లలితతో పాటు అటవీ శాఖ సిబ్బంది, వాచర్లు పాల్గొన్నారు.