19 June, 2026 | 2:48 AM

గిరిజన బాలుర కళాశాల వసతి గృహం ప్రారంభం

19-06-2026 12:03 AM

హనుమకొండ, జూన్ 18(విజయ క్రాంతి): హనుమకొండ అశోక్ కాలనీలోని ఐటీడీఏ గిరిజన కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజనం, విద్యా సౌకర్యాలు కల్పించాలని అ ధికారులకు సూచించారు.

వసతి గృహ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది సేవాభావంతో పనిచేస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి  నాగసాగర్, సహాయ గి రిజన అభివృద్ధి అధికారి  హసీనా బేగం, ఏ సీఎంఓ శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ వ సతి గృహ అధికారులు రాజయ్య, ఆల్య, సు ధాకర్, రాజారావు, శ్రీనివాస్, బ్రహ్మచారి, కృష్ణమోహన్, షేక్ అలీ, జ్యోతి, రాధిక, నాయకులు సరళ, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.