calender_icon.png 21 February, 2026 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్పను సందర్శించిన అటవీ అధికారులు

20-02-2026 12:00:00 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత గాంచిన రామప్ప దేవాలయాన్ని గురువా రం తెలంగాణ అటవీ అకాడమీలో శిక్షణ పొందుతున్న 41 మంది అటవీ అధికారులు డి సి ఎఫ్ వో గంగారెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చ కులు హరీష్ శర్మ, ఉమాశంకర్లు అధికారులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసా దాలు అందజేశారు.

ఆలయ చారిత్రక ప్రా ధాన్యం, కట్టడ శిల్పకళ వైభవం, శిల్పాలలో ప్రతిబింబించిన కళా నైపుణ్యాన్ని టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించా రు. అనంతరం అధికారులు రామప్ప చెరువును సందర్శించి, అక్కడి ప్రకృతి సౌంద ర్యాన్ని ఆస్వాదించారు. అలాగే పాలంపేట గ్రామ శివారులోని కేన్ మొక్కలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టూరిస్ట్ పోలీస్ సి బ్బంది శ్రీనివాస్, భద్రు, అటవీ అధికారులు మరియు ఇతర సిబ్బందిలు పాల్గొన్నారు.