20-02-2026 12:00:00 AM
వరంగల్ (మహబూబాబాద్) ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపై చెత్త వేసే ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించిన మున్సిపల్ అధికారులు అందుకు విరుగుడుగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ డివిజన్లో చెత్త ఎక్కువగా వేసే ప్రదేశాలను శుభ్రం చేసి ‘ఇక్కడ చెత్త వే స్తే వెయ్యి రూపాయలు జరిమానా’ వేస్తామంటూ సిబ్బంది చేత ప్రత్యేకంగా ముగ్గు రూపంలో రాయిస్తున్నారు. ఈ ముగ్గులను చూసి చెత్త వేసేవారు ఒక అడుగు వెనక్కి వే సే పరిస్థితి కనిపిస్తోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.