26 August, 2026 | 5:08 AM

భూ యజమానుల సంతకాలు ఫోర్జరీ

26-08-2026 02:11 AM

నలుగురి అరెస్ట్

రంగారెడ్డి, ఆగస్టు 25(విజయక్రాంతి): భూ యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి, వారి సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల భూమిని అక్రమ ంగా లేఅవుట్ చేసి అక్రమంగా సంపాదించాలని చూసిన నలుగురు నిందితులను కం దుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం  కందుకూరు గ్రా మానికి చెందిన ఐనవోలు శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కందుకూరు రెవెన్యూ పరి ధిలోని సర్వే నంబర్లు 151, 152, 153, 165 మరియు 166 లలో ఉన్న సుమారు 31 ఎకరాల 36 గుంటల విలువైన భూమిపై కొ ందరు ముఠాగా ఏర్పడి కన్ను వేశారు.

భూ యజమానుల ప్రమేయం, అనుమతి లేకుండానే వారి సంతకాలనుఫోర్జరీ చేశారు. ఆపై భూమి డెవలప్మెంట్కు యజమానులు అంగీకరించినట్లు నమ్మిస్తూ డెవలప్మెంట్ అగ్రి మె ంట్-కమ్  జనరల్ పవర్ అఫ్ అటర్నీ  పేరు తో 18 పేజీల నకిలీ పత్రాన్ని సృష్టించా రు. దాని ఆధారంగా భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించడం ద్వారా అక్రమంగా భారీగా లాభపడాలని కుట్ర పన్నినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.