9 August, 2026 | 4:06 AM

కార్మికుల హక్కులపై అవగాహన అవసరం

26-05-2024 01:55 AM

నాగర్‌కర్నూల్, మే 25 (విజయక్రాంతి): అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచు కోవాలని న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సబిత సూచించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో శనివారం కార్మికులు, మహిళలతో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నాయని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ ఈశ్రమ్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని సబ్‌జైలును అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధితో కలిసి సందర్శించారు.