1 September, 2026 | 8:28 PM

వలిగొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిరసన

15-06-2025 | 10:35pm

వలిగొండ (విజయక్రాంతి): యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అరెస్టును నిరసిస్తూ ఆదివారం సాయంత్రం వలిగొండ పోలీస్ స్టేషన్(Valigonda Police Station) ఎదుట ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత(Former MLA Sunitha) నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామంలో వైద్య కళాశాలను నిర్మించాలని ప్రభుత్వం మరో చోటికి తరలించాలని చూస్తుందని దానిని నిరసిస్తూ వెంకటయ్య చేపట్టిన నిరాహార దీక్ష భగ్నం చేయాలని అరెస్టు చేసి వలిగొండ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని దీనిని మేము తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు.

అయితే ప్రభుత్వం వైద్య కళాశాల విషయంలో ఏదో ఒక హామీ ఇచ్చేవరకు వెంకటయ్య నిరసన కొనసాగిస్తాడని అన్నారు. అనంతరం వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి 7:30 కు వెంకటయ్య దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు అఫ్రోజ్, మాజీ సర్పంచ్ పనమటి మమత, బల్గూరి నరేష్ రెడ్డి, మోతే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.