16-09-2025 08:08:27 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి శంకర్ నేత్రాలయాన్ని పునఃప్రారంభం అనంతరం సందర్శించారు. ఈ సందర్భంగా నేత్రాలయానికి చెందిన డాక్టర్ రవీందర్ గౌడ్ ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆ తర్వాత శేషుకుమారి మాట్లాడుతూ డాక్టర్ రవీందర్ గౌడ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరింత మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో *కూతురు నరసింహ, హనుమంత్ రావు, వనం శ్రీనివాస్,కమల్ రాజ్* తదితరులు పాల్గొన్నారు.