6 May, 2026 | 10:16 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

16-09-2025 08:12 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం మోతే–గుర్జాల్ (ఆర్‌అండ్‌బీ) రహదారిలో వoడ్రికల్ గ్రామం వద్ద ఉన్న లోలెవెల్ కాజ్‌వే ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతింది. తాత్కాలికంగా రహదారి మీద గ్రావెల్ వేసి రూ.60 వేల వ్యయంతో పునరుద్ధరించడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్‌కి ఆదేశాలు జారీ చేశారు. శాశ్వత పునరుద్ధరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా సైడ్‌వాల్ నిర్మాణం, అదనపు పైపులు ఏర్పాటు చేయనున్నట్లు P.మోహన్ ఈ ఈ తెలిపారు. దీనికి రూ.6 లక్షల అంచనా వ్యయం ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు.