6 April, 2026 | 2:48 AM

సీఎం రేవంత్ రెడ్డి లాగే కాంగ్రెస్ నాయకుల తీరు

06-04-2026 12:00 AM

కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దారుణం

కాంగ్రెస్ గుండాయిజంపై బిఆర్‌ఎస్ ఆగ్రహం బంద్కు పిలుపు

విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి 

గజ్వేల్, ఏప్రిల్ 5: గజ్వేల్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీ వ్రంగా ఖండిస్తూ బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎ మ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీరుకు అనుగుణంగానే కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, మెరుగైన వైద్యసదుపా యాలు, అద్భుతమైన రహదారులు అందించిన ఘనత కేసీఆర్కే చెందుతుందని పేర్కొన్నారు.కేసీఆ్ప అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టాలని ఎలాంటి జీవో లేదని స్పష్టం చేశారు. రా హుల్ గాంధీ కార్యాలయంలో మోదీ ఫోటో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గుండాయిజానికి పాల్పడి క్యాంపు కార్యాలయాలపై దాడులు చేయడం దారుణమని, అభివృద్ధి చేస్తేనే ప్రజల్లో నిలు స్తారని, ప్రతిపక్షాలపై దాడులతో కాదని అన్నారు.

ఇలాంటి చిల్లర చర్యలు చేస్తే స హించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నా యకుల తీరుతో గజ్వేల్ అభివృద్ధి మళ్లీ 50 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.ప్రస్తుతం ప్రభుత్వం నిధులు తీసుకురావడం లో విఫలమైందని, మిగిలిన కాలువలను పూర్తి చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనపై మానవ హ క్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని ఎలాంటి జీవో లేదని పునరు ద్ఘాటించా రు.

గుండాయిజంతో క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం అత్యంత దారుణమన్నారు.గత 20 నెలల్లో గజ్వేల్కు ఒక్క రూపా యి నిధులు కూడా మంజూరు కాలేదని ఆరోపించారు. రాజకీయం అంటే గుండాగిరి కాదని, అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనబడటం లేదని, అవినీతి పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బిఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో మాజీ రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవి రవీందర్, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు నవాజ్ మీరా, బెండ మధు, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు,,సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.