15 July, 2026 | 1:07 PM

Breaking News

'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •   రూపాయి విలువ పెరిగింది.. 553 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు   •  

కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ ఈఎన్సీ, సీడీవో మాజీ ఈఎన్సీ

22-08-2024 05:29 PM

హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి గురువారం హాజరైయ్యారు. మురళీధర్, నరేందర్ రెడ్డిలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కమిషన్ ముందు కీలక అంశాలను నరేందర్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్భంగా డిజైన్లు, డ్రాయింగ్ లకు ఫైనల్ అప్రూవల్ కు మొదటగా సంతకం చేయలేదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల సంతకాలు చేశాన్నాని, త్వరగా చేయాలన్న ఒత్తిడి వల్ల హడావిడిగా అన్ని అప్రూవల్ చేశామన్నారు.

మేడిగడ్డ ప్రతి డిజైన్ లో సీడీవో పాటు ఎల్అండ్ టీ సంస్థ పాల్గొన్నదని, ప్రాజెక్టు నిర్మాణ సంబంధిత చర్చల్లో నేను పాల్గొన్నాలేదని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే తప్పిదాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని సీడీవో మాజీ ఈఎన్సీ వెల్లడించారు. పైనుంచి ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ సరిగా చేయలేదని ఆయన సూచించారు. బ్యారేజీల నిర్వహణ, గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.