కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం
15-07-2026 12:26 PM
భిక్కనూర్, జూలై 15*(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల్లో పీపీఆర్ (PPR) వ్యాధి నివారణ కోసం ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 1,562 గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి–సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, వార్డు సభ్యురాలు మమత–రాజు, పశువైద్య సిబ్బంది మోహిన్ (ఎల్‌ఎస్‌ఏ), మహేష్ (ఎల్‌ఎస్‌ఏ), సందీప్ పాల్గొని టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గొర్రెల పెంపకదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు. అధికారులు పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న టీకాల కార్యక్రమాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






