14 April, 2026 | 1:53 PM

సర్పంచ్ ను సన్మానించిన దళిత సంఘాల నాయకులు

16-12-2025 04:22 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హోరాహోరీ పోటీలో గెలుపొందిన ధోనికేని లక్ష్మి దయానంద్ లను దళిత సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దయానందలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నేత శ్యామ్, జన్నారపు శంకర్, దావతి గంగాధర్, కొంపల్లి రాజేందర్, దామోదర్, బుట్టి రాజన్న, హరీష్, విక్రమ్, కళ్యాణ్, నేత పవిత్ర, భైరభారతి, సుజాత, బుట్టి లక్ష్మీ, ప్రేమల, తదితరులు ఉన్నారు.