calender_icon.png 13 July, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్ము ధైర్యం ఉంటే మా సవాల్ స్వీకరించు

12-07-2025 11:14:31 PM

- ఆరోపణలు చేస్తే అందలం ఎక్కుతావా..?

- మల్లు నరసింహారెడ్డి నోరు అదుపులో పెట్టుకో 

- మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఎంతో లబ్ధి పొందావు 

- విలేకరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి ఆగ్రహం..

మహబూబ్ నగర్: ఏదో నోరు ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని అనుకుంటే పొరపాటు పడినట్టేనని దమ్ము ధైర్యం ఉంటే మేము సవాల్ చేస్తున్న అంశాలను స్వీకరించి చర్చలో పాల్గొనాలని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు మల్లు నర్సింహా రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మండల స్థాయి లీడర్ నువ్వు నీ ఫోన్ ట్యాప్ చేసారని అనడం హాస్యాస్పదమని విమర్శించారు.

ఆరోపణలు చేయడం కాదు నిరూపించాలని, ఏ దర్యాప్తు సంస్థ కైనా ఫిర్యాదు చేయాలని కోరారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటీవల మహబూబ్ నగర్, హన్వాడ మీటింగ్ లు చూసి బయపడి ఇలాంటి తప్పడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చిన వెంటనే మల్లు నర్సింహారెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.మల్లు నర్సింహా రెడ్డి అమ్మ చనిపోతే అతని  కూతురి ని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరిని ఒప్పించి ఎన్నిక చేయడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇక్కడి వారిని కాంగ్రెస్ పార్టీ లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. 

ఇష్టం సారంగా మాట్లాడితే సరిపోదు..

శ్రీనివాస్ గౌడ్ గారి వద్ద నీ కుటుంబం.. నీవు పొందిన లబ్ది మరిచిపోయినట్టు ఉన్నావని, దమ్ము ఉంటే బహిరంగ చర్చకు మల్లు నర్సింహా రెడ్డి రావాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసారని ఆరోపణల్లో వాస్తవం లేదని, సర్పంచ్ ఎన్నికల్లో సొంత అన్నను మోసం చేసిన చరిత్ర నీది మల్లు నర్సింహా రెడ్డిది అన్నారు. అన్న రాజకీయంలోకి వస్తే ఇబ్బంది అయితదని తన కూతురిని ఏకగ్రీవం చేసుకున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి వద్దకు వస్తే మమ్మల్ని అందరిని ఒప్పించి ఏకగ్రీవం చేసుకున్నావని, మాజీ మంత్రి దయదక్షిణాలతో నీవు.. నీ కుటుంబం బాగుపడ్డారన్నారు. దీనిమీద చర్చకి రావాలని, నేను మన్యంకొండ వద్ద రేపు వస్తా.. దా చర్చకు సిద్ధమన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్వారా నీవు..నీ కుటుంబం పొందిన లబ్ది ఆధారాలతో చర్చ పెడదామన్నారు. 

గ్రామపంచాయతీ బిల్డింగ్ కడితే బిల్లు రాలేదని అంటివి.. ఆధారాలతో సహా నువ్వు పొందిన లబ్ది ప్రజలకి చూపిస్తా.. నీ అల్లుడు పొందిన లబ్దిని కూడా ప్రజలకు చెబుదామన్నారు. మల్లు నర్సింహా రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదని, వెంటనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మల్లు నర్సింహారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పీఏసీఎస్సీ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, ప్రచార కార్యదర్శి చిట్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.