calender_icon.png 13 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం

12-07-2025 11:18:50 PM

అనంతగిరి: బీజేపీ పార్టీ అనంతగిరి మండల ప్రధాన కార్యదర్శులను శనివారం నియమించారు. గొండ్రియాల గ్రామానికి చెందిన యడ్లపల్లి రామారావు, పాలవరం గ్రామానికి చెందిన మట్టపల్లి సిద్దయ్యను ప్రధాన కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శిలు మాట్లాడుతూ... తమ నియమాకానికి సహకరించిన జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, మండల అధ్యక్షులు చింతకుంట్ల సతీష్, సీనియర్ నాయకులు వంగవీటి శ్రీను, మాజీ అధ్యక్షులు ఏలేటి వెంకటేశ్వర రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.