12-07-2025 11:09:55 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం శనివారం దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అబ్జర్వర్ రహీం ఉషన్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షపదవి కోసం టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్, పరిశీలకుడు రహీమ్ హుస్సేన్ కి దరఖాస్తును అందజేశారు.