21 April, 2026 | 3:25 PM

పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’

21-04-2026 02:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు మాజీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు దామోదర్ తన పుట్టినిల్లు ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడువాయి మండలం కాల్వపల్లికి చేరుకున్నాడు. పీపుల్స్ వార్ పార్టీలో చేరిన చొక్కారావు అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహించి అనేక సంచలన ఘటనల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎదుట చొక్కారావ్ లొంగిపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన స్వగ్రామానికి చేరుకుని తల్లి బతుకమ్మ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చొక్కారావ్ చాలా ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత మొట్టమొదటిసారిగా అజ్ఞాతం వీడి గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఆయన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.