21 April, 2026 | 3:47 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

కాటారంలో రైతు భరోసా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

21-04-2026 02:34 PM

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు

మంథని,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, ఇతర జిల్లాల ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.

అలాగే మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరమణులు, యూత్ కాంగ్రెస్ సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి పోలీస్ శాఖ సిబ్బందికి, డీఎస్ బి వాలంటీర్స్ కు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి సమన్వయం, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర అభినందనీయమని మంత్రి  అన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.