27-10-2025 08:51:57 PM
ఆదిలాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పరామర్శించారు. కంది శ్రీనివాస రెడ్డి బావమరిది గడ్డం అఖిల్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమవారం బేల మండలం సిర్సన్న గ్రామానికి వెళ్ళి అఖిల్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి, కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నవయజులో గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, గిమ్మ సంతోష్ రావు, తదితరులు అన్నారు.