calender_icon.png 27 October, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి..

27-10-2025 08:47:09 PM

చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన కన్నేబోయిన నరసింహ మధ్యాహ్నం పశువులను మెపుతున్న సందర్భంలో తెగిపడిన తీగలకు 2 గేదెలు తాకడంతో అక్కడికక్కడే రెండు గేదెలు మృతిచెందాయి. దాదాపు లక్ష ఇరవై వేల రూపాయల విలువ గల పాడి గేదెలు కళ్ళముందే విద్యుదాఘాతంతో చనిపోవడం చూసి రైతు కన్నీరు పెట్టుకున్నాడు. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి గేదెలకు నష్టపరిహారం కల్పించాలని పలువురు అధికారులను విజ్ఞప్తి చేశారు.