27-10-2025 08:55:35 PM
ఎస్ఐ బోయిని సౌజన్య..
బెజ్జంకి: ప్రజల సమస్యలు పరిష్కరించటమే ధ్యేయంగా పోలీస్ శాఖ అందుబాటులో వుండి సేవలు అందిస్తుందని స్థానిక ఎస్ఐ బోయిని సౌజన్య అన్నారు. మండలంలోని వడ్లూరు గ్రామంలో ఎస్ఐ సౌజన్య గ్రామస్తులతో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సంద్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామంలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, శాంతి భద్రతల విఘాతం అనుమానస్పద వ్యక్తుల సంచారం వంటి వాటిపై డయల్ 100 ఫిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత ప్రముఖ్యమైనదని ఎవరైనా సైబర్ నేరనికి గురైతే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగం విక్రయాలపై ఉపేక్షించేది లేదని వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రత పరిరక్షణకు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు, విపిఓ జబ్బర్ లాల్, శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.