calender_icon.png 2 January, 2026 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌.. టీఎంసీల కొద్దీ అబద్ధాలు

02-01-2026 01:37:51 AM

నీకు బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదు

నీకు తెలిసిందల్లా అనాగరిక భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగమే

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 1(విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పా రించారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎనుముల రేవంత్‌రెడ్డి అని, నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్‌రెడ్డినే ఎంపిక చేస్తారని ఎద్దేవా చేశా రు. సీఎంకు బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యమన్నారు.

ఇవాళ కొత్తగా తెలిసింది, ‘నీకు బచావత్ ట్రిబ్యునల్‌కు, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సభకు వస్తే కేసీఆర్‌ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చుతావా? అని అన్నారు.  ‘కేసీఆర్ ను, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని’ అంటూ అనాగరిక వ్యా ఖ్యలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తూ సుద్దపూసలా నటిస్తావా? అని ప్రశ్నించారు.

ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నువ్వు

‘ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నువ్వు’ అని, బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడినవు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయం లో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధా నం చెప్పలేదు ఎందుకు అని ప్రశ్నించారు. నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీ టింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు? తెలపాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టీఎంసీలు పునఃపంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారు? ఈరోజు ‘నువ్వు’ కొత్తగా 71 శాతం వాటా తెలంగాణకు రావాలని మా ట్లాడినవు.

ఆనాడే కేసీఆర్ 811 టీఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం ‘నీకు తెలియదా?’ అని ప్ర శ్నించారు.  కేంద్రం స్పందించకపోతే సుప్రీం కు ఎందుకు వెళ్తారు? బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకూ 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు? రెండు అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు? అపె క్స్‌లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా కళ్లు పెద్దవి చేసి చదువుకో రేవంత్‌రెడ్డి? అని హిత వు పలికారు. మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనన్నారు.

తుంగభద్ర నది ఉందని ‘నీకు తెలుసా’..

అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి.. కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్ఞానంతో మాట్లాడినవు , తుంగభద్ర నది ఉందని ‘నీకు తెలుసా’. దాని ద్వారా 450 నుంచి -600 టీఎంసీలు ప్రతేటా శ్రీశైలానికి వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేక పాయె’ అన్నారు. ఈ ఏడాది జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది? అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా? అని పేర్కొన్నారు.

జూరా ల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు. ఇంకా దాని మీద పాలమూరు భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగం అయిపోరా? అని ఎద్దే వా చేశారు. మీరు వచ్చిన రెండేళ్ల ఒక నెల లో ఒక్క అనుమతి కూడా తెచ్చింది లేదని, డీపీఆర్ వెనక్కి వచ్చేలా చేశారని, ఇదీ నీ స మర్థత, నీ గొప్పతనం అని ఆగ్రహించారు.