02-01-2026 01:38:59 AM
వృద్ధాశ్రమంలో నిరాటంకంగా న్యూ ఇయర్ వేడుకలు
నటి పావలా శ్యామలకు పరామర్శించిన సీపీ
సికింద్రాబాద్, జనవరి 1 (విజయక్రాంతి) : వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలని, అందుకు ప్రతి వ్యక్తి తమ తల్లి దండ్రుల పట్ల ప్రేమతో వ్యవహరించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా దైవంగా భావించి పూజించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.నూతన సంవత్సర వేడుక లను ఆడంబరాలకు దూరంగా,సేవా దృక్పథంతో జరుపుకోవాలన్న సంకల్పంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిష నర్ సిపి సజ్జనర్ గురువారం వృద్దాశ్రమంలో వృద్దులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.
గురు వారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న వృద్ధాశ్ర మం , హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించి వారితో కలిసి కేక్కట్ చేశారు.48 మంది వృద్ధులకు పండ్లు, మిఠాయిలు అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ,వారితో కాసేపు ఆత్మీయంగా గడిపి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కన్నవారిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని సీపీ స్పష్టం చేశారు. జీవనశైలి, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడిసాకు తో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పరిమితం చేయ డం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్త ర మండల డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ డాక్టర్ పగడాల అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేష్,కార్ఖానా ఇన్‌స్పెక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
పావలా శ్యామలకు సీపీ పరామర్శ
కార్కానాలోని ఆర్కే ఫౌండేషన్చేరి ఆశ్ర యం పొందుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలను సీపీ సజ్జనార్ పరామర్శించారు. ఆత్మీయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నెలరోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలను తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించారు. సీపీ సజ్జనర్ మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.