02-01-2026 01:37:29 AM
జర్నలిస్టులను విడదీసే రెండు కార్డుల విధానం సరికాదు
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): జర్నలిస్టులకు అన్యాయం చేసే జీవో 252పై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జీవో 252 సవరణ కోసం టీయూడబ్ల్యూజే చేస్తు న్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, ప్రభుత్వానికి తగు సూచనలు చేసి జర్న లిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభు త్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 252ను వెంటనే సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రతినిధులు గురువారం మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23 వేల మందికి అక్రిడిటేషన్ కార్డులు లభించేవని, కానీ నూతన జీవో 252 వల్ల దాదాపు 13 వేల మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ముఖ్యంగా డెస్క్, బ్యూరో జర్నలిస్టులంటూ విభజించి, రెండు కార్డుల విధానాన్ని తీసుకురావడం వల్ల జర్నలిస్టుల మధ్య విభజన రేఖలు గీసినట్టవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను గౌరవించాల్సింది పోయి వారిని అణచివేసేలా కొత్త నిబంధనలు తేవడం దుర్మార్గమని పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టులకు, రిపోర్టర్లకు వేరువేరు కార్డుల విధానం తీసుకురావడం వారి మధ్య చిచ్చు పెట్టడమేనని మండిపడ్డారు.
జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల పట్టింపు లేదు
బీఆర్‌ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా 23 వేల మందికి అక్రిడిటేషన్లు ఇచ్చి గౌరవించుకున్నామని, ఇప్పుడు కాంగ్రె స్ ప్రభుత్వం ఆ సంఖ్యను 13 వేలకు కుదిస్తే దాదాపు 10 వేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని, జర్నలిస్టుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కొత్త జీవో వల్ల జర్నలిస్టులు హెల్త్ కార్డులు, బస్ పాస్ సౌకర్యాలను కోల్పోయే ప్రమా దం ఉందని, జర్నలిస్టుల ఆరోగ్యం, వారి ప్రయాణ సౌకర్యాల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం శోచనీయమని విమర్శించారు.
గతంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించి, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేదని, ఇప్పుడు ఆ ప్రీమి యం చెల్లించడంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తూ అన్యాయం చేస్తున్నదన్నా రు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని, అందుకే కేసీఆర్ జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించి, వారి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.
వినతిపత్రం స మర్పించిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, కోశాధికారి పీ యోగనంద్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి యార నవీన్‌కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వా రి భాస్కర్, చిన్నపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ ఉన్నారు.