calender_icon.png 28 July, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్న సీతారాంరెడ్డి జన్మదిన వేడుకలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

27-07-2025 11:26:32 PM

పెన్ పహాడ్: మండలంలోని చీదేళ్ల గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు కలసి మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీతారాం రెడ్డి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆశీర్వాదం అందుకున్నారు. స్వీట్లు పంపిణి చేశారు. అంతకుముందు మాజీ బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు కుమారుని వివాహ రిషిప్సన్ వేడుకలో జగదీశ్ రెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, దొంగరి యుగేందర్, పరెడ్డి సీతారాంరెడ్డి, ఆనంతుల శ్రీను, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, నెమ్మాది నగేష్, షరీఫోద్దీన్, మాధవ్ రావు తదితరులు ఉన్నారు.