28-07-2025 12:00:00 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి జూలై 27 ( విజయ క్రాంతి) సంస్కారవంతమైన చదువుతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయంలో కీ.శే కోడూరి రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన జాతీయ కథల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలను ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలంటే అది చదువుతూనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక స్పృహను కలిగి ఉండి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజా గ్రంథాలయ నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం కొప్పూర్ గ్రామం నుండి కొత్తపెళ్లి కి వెళ్లే మార్గంలో రూ.మూడు కోట్ల వ్యాయంతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా నక్షత్ర దీక్ష కార్యక్రమంలో స్వాములతో కలిసి భద్రకాళి సమేత వీరభద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తకొండ చౌరస్తా వద్ద త్రిశూలం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓ ఎస్ డి శ్రీనివాస్, రచయిత అందెశ్రీ, కోడూరి సరోజన, నాయకులు అశోక్ ముఖర్జీ, కొలుగూరి రాజు, పిడిశెట్టి కనకయ్య, కేతిరి లక్ష్మారెడ్డి, దస్తరి శ్రావణ్, వరుణ్, చిదురాల స్వరూప, సుహాసిని, బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాణాధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.