పేద ప్రజలకు సేవలందించిన రవీందర్ రెడ్డి మరణం బాధాకరం
- మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
- మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన మంత్రి
- కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
గరిడేపల్లి,(విజయ క్రాంతి): గ్రామ సర్పంచిగా పేద ప్రజలకు గ్రామంలో సేవ చేసిన వెన్న రవీందర్ రెడ్డి మృతి గ్రామ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మండలంలోని కోదండరాంపురం గ్రామ మాజీ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి మృతదేహానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు.
క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ప్రజల కోసం సేవలందించిన రవీందర్ రెడ్డి మరణం గ్రామానికి తీరని లోటని ఆయన అన్నారు. క్యాన్సర్ వ్యాధితో రవీందర్ రెడ్డి మృతి చాలా బాధాకరమని తెలిపారు. ముందుగా అదే గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన బత్తిని శేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.






