తహశీల్దార్ గా హిమబిందు బాధ్యతలు స్వీకరణ
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల నూతన తహశీల్దార్ గా కె.హిమబిందు బాధ్యతలు స్వీకరించారు. గతంలో వారు కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలంలో తహశీల్దార్ గా పని చేస్తూ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో భాగంగా బుధవారం బదిలీపై మఠంపల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. భాద్యతలు చేపట్టిన సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందేలా బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఇక్కడ తహశీల్దార్ గా విధులు నిర్వహించిన యల్.మంగ రాథోడ్ కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం తహశీల్దార్ గా బదిలీపై వెళ్లారు.






