ఘనంగా శ్రీ రాముల వారి కళ్యాణం.. పట్టు వస్త్రాల సమర్పణ
స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శుక్రవారం మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగగా, మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా జరిగిన ఈ కళ్యాణాన్ని భక్తులతో కలిసి వీక్షించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు, స్వాములవారి ఆశీర్వాదాలు స్వీకరించారు. అనంతరం మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...“శ్రీరామ నవమి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక, ప్రజలందరూ ఐక్యంగా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రభు,జావీద్ ఖాన్, యాసారం శ్రీనివాస్, ఆకుల మధుకర్, యాస రాజు,పింగళి జోగి రెడ్డి, కిరణ్ నాయక్, అమర్ పటేల్, లగ్గాని సోమేశ్ గౌడ్, పి శ్రీధర్ గౌడ్,బాలరాజు, వారికల శ్రీనివాస్, దేవాలయం చైర్మన్ కావడపు రాoరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




