calender_icon.png 11 January, 2026 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలుపుతుండ్రు

10-01-2026 08:36:52 PM

రేపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక 

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్  పరిశీలించారు. సభ ఏర్పాటు నిమిత్తం ఎంబీసీ మైదానం ను పరిశీలించారు. కేటీఆర్ సభకు పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబెర్స్ లను కేటీఆర్ సన్మానిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికీ అండగా ఉంటామని చెప్పారు.  మహబూబ్ నగర్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సరిస్తామని అన్నారు. పురపాలిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెప్పారు. రెండేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, మీరు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరారు.

ఈ సమావేశంలో గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గణేష్, కోట్ల నర్సింహా, కొండ లక్ష్మయ్య, శ్రీనివాస్, అనంతరెడ్డి, అన్వార్ పాష, వెదవత్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు