calender_icon.png 11 January, 2026 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల్లో ఉత్సాహాన్ని నింపడానికే సంక్రాంతి ముగ్గుల పోటీలు

10-01-2026 08:30:18 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మహిళలల్లో ఉత్సాహాన్ని నింపడానికే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుందని పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి  అన్నారు. జీహెచ్ఎంసి ఘట్ కేసర్  సర్కిల్ పోచారం డివిజన్ -8 లో సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నోజీగూడ యాదాద్రి పార్కు తెలంగాణ క్రీడా ప్రాంగణం వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో 

శనివారం సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈపోటీలలో 120 మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీ విజేతలు మొదటి బహుమతి  శిరీష రూ. 5వేలు, రెండవ బహుమతి లావణ్య రూ. 3 వేలు, మూడవ బహుమతి సంధ్య రూ. 2 వేలు, నాలుగవ బహుమతి నాగమణి రూ. 1000, పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులను ఘట్ కేసర్ రైతు సహకార సంఘం మాజీ డైరెక్టర్ బోయపల్లి సత్తి రెడ్డి  చేతుల మీదుగా అందించారు.

అలాగే పాల్గొన్న వారికి బహుమతుల దాతలు ననావత్ జితేందర్ నాయక్, కె.ఎం. రెడ్డి, నగదు బహుమతి దాత బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలలో పండుగ కొత్త ఉత్సాహం నింపడనికి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.