పింఛన్ డబ్బులతో ఇళ్లు కట్టుకుంటే.. కూల్చివేస్తున్నారు
30-08-2024 11:24 AM
హైదరాబాద్: పింఛన్ డబ్బులతో ఇళ్లు కట్టుకుంటే.. కూల్చివేశారని బాధితులు వాపోతున్నారని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ నిర్వహించిన మీడియా సమావేశం ఆరోపించారు. వారం రోజుల్లో గృహప్రవేశం ఉందని చెప్పినా వినకుండా ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ఆదర్శనగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లు కూల్చివేసిన ప్రాంతంలో, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన మేరకు బీఆర్ఎస్ నాయకులు అల్పాహారం అందజేశారు.






