calender_icon.png 11 May, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి

23-04-2025 11:04:07 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని దోస పహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెన్ను ప్రభాకర్ రెడ్డి, మో హాన్ రెడ్డిల పితృమూర్తి చెన్ను మల్లరెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందాడు. ఈ మేరకు బుధవారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విచ్చేసి మృతుని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొండేటి వీరారెడ్డి మాతృమూర్తి కొండేటి గోపమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆ తర్వాత  గ్రామ  మాజీ సర్పంచ్  దొంగరి సుధాకర్ కాలికి గాయమై అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరామర్శించారు. ఈసందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, మాజీ ఎంపీపీ నెమ్మది బిక్షం, సింగిల్ విండో చెర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతల జానకి రాంరెడ్డి, చెన్ను శ్రీనివాస్ రెడ్డి, మేకల శ్రీనివాస్, కొండ జానకి రాములు, యళంల జగన్, అశోక్ తదితరులు ఉన్నారు.