calender_icon.png 12 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాధాకృష్ణ దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ఠ

24-04-2025 12:00:00 AM

నిర్మల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భాగ్యనగర్‌లో   శ్రీ రాధాకృష్ణ ఆలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బుధవారం రోజు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు హాజరయ్యారు. వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి 50 లక్ష ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

అనంతరం ఇంద్రకరణ్ రెడ్డిని శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి. ఈశ్వర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్,పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ,  రమణ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్, పాకాల రాంచేందర్, శ్రీకాంత్ యాదవ్ మాజీ ఎఎంసీ వైస్ చైర్మ న్ వినయ్, రవి, సత్యనారాయణ, టెంపుల్ మెంబెర్స్, నాయకులు పాల్గొన్నారు