10 May, 2026 | 9:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

10-08-2025 02:32 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Former MLA Pailla Shekar Reddy) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఎండి అప్రోజ్, మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిచేయడం జరిగిందని అన్నారు. రాబోయే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు తమ సత్తా చాటుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశిరెడ్డి జనార్దన్ రెడ్డి, కాసుల కృష్ణ, కొంతం శ్రీను, ఐటిపాముల సత్యనారాయణ, పబ్బు వెంకటరమణ, పల్సం రాజు, కళ్లెం మారయ్య తదితరులు పాల్గొన్నారు.